Un authorised లేఔట్ ల registration లు ఆగిపోయి నెలలు గడుస్తున్నాయి.
మార్కెట్ లో ఎంతో డబ్బు బ్లాక్ అయింది, లావాదేవీలు ఆగిపోయాయి.
ప్రభుత్వ నిర్ణయం కోసం అనేకమంది మంది ఎదురు చూస్తున్నారు. ఎలాటి రెగ్యులరైజేషన్ కానీ, కొనుగోలుదార్ల ని ధృష్టి లో ఉంచుకుని రాయితీలు గాని ప్రకటించలేదు. ఒక పాలసీ తీసుకు రాలేదు. పావలా అడ్వాన్స్ ల మీద రియల్ ఎస్టేట్ రంగం pause బటన్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంది.
స్వపక్ష నేతల రియల్ ఎస్టేట్ దందా కూడా నిలిచిపోయింది.
కార్లలో సౌకర్యంగా కాలం గడిపిన రియల్టర్ లు ఖర్చుల కోసం పోపుల పెట్టె లు వెతుక్కుంటున్నారు.
అవకాశం ఉన్న చోట DTCP (Directorate of Town & Country Planning) అప్రూవల్ కి అనుగుణంగా లేఔట్ లు మార్చుకుంటున్నారు.
52% లాండ్ మాత్రమే (Roads, communal area, 5% mortgage to govt etc పోను మిగిలేది) సేలబుల్ గా మిగులుతుంది.
అర్ధ రూపాయిది రూపాయిగా మారింది.
సామాన్యుడికి స్వంత స్థలం లో ఇల్లు కల గా మారి పోతుంది. కనీసం 120 గజాలు (DTCP approved layouts minimum plot area) స్థలం కలిగిఉండటం అనేది మధ్య తరగతి వాడికి ఒక కలగా మిగిలిపోనుంది.
ఇప్పటికే ఆంద్ర లో పెట్టుబడి పెట్టటానికి ఆలోచిస్తున్నవారు, మార్గాంతరాలు వెతుకుంటున్నారు.
సమాంతరం గా ప్రభుత్వ ఆదాయం కుంటుబడుతుంది.
51Subrahmanyam Koduganti, Apv Prasad and 49 others
19 comments
1 share