“చిన్నప్పుడు పచారీ కొట్టుకి పావు కేజీ కందిపప్పుకి వెళ్తే అదొక్కటే తెచ్చేవాళ్లం. ఈ దరిద్రపు మాల్ కల్చర్ వచ్చింది అడ్డమైన నానా చెత్త కొంటున్నాం. కందిపప్పు తప్ప.” ఆవిడ కూర్చోగానే గేరు మారుస్తూ చెప్పాను.
“మాల్ కి వెళ్ళే ప్రతిసారి నీ మొదటి డైలాగ్ ఇదే” అంది.
“అబ్బే అవసరమయినవి మాత్రమే కొంటావు అనుకో..నీ విషయం కాదు. జనరల్ గా చెబుతున్నాను.”
అది జనరల్ కాదని ఇద్దరికీ తెలుసు.
ఏసి ఆన్ చేసినా కారు లో వేడి అలానే ఉంది.
“ఈ యెల్లో చీర నీకు బాగా నప్పుతుంది. Looks good”
రెండు నిమిషాలకి ఏసి నాబ్ వెనక్కి తిప్పాను.
పార్కింగ్ చేసి. మాల్ లో కి వెళ్తూ “పర్సు డాష్ బోర్డు లో ఉంది. తీసుకురానా?”
“నా హాండ్ బాగ్ లో ఉంది.” అంటూ తీసి ఇచ్చింది.
పచారీ సామాను, అవీ ఇవీ కొంటూ కొద్ది సేపు మాల్ అంతా కలియ తిరిగాం.
పూర్వం తోపుడు బండి దగ్గర కి వెళ్ళి కొనేవాళ్లం ఇప్పుడు బండి తోసుకుంటూ … ముందుకు వెళ్తున్నాము.
ఏదో క్లియరెన్స్ సేల్ అనౌన్స్మెంట్ వినిపించింది.
“ఈ ఫ్లోర్ లో కాదు లా ఉంది. అయినా క్లియరెన్స్ అంటే ..” అంటూ హడావిడిగా “టొమోటాలు చూసావు 65 రూపాయలు మార్కెట్ లో 80, అల్లం కేజి ముప్పై అయిదు.” భారీ ఆఫర్లు చెప్పాను.
మూడు ట్రాలీ బాగ్ లు కలిసి 7990/- అని అదీ ఈ రోజు మాత్రమే అని, గొప్ప ఆఫర్ అని.. కస్టమర్ లు తొక్కుకుంటూ త్వరపడమని ఇందాక మైకు లో చెప్పిన మాటల తాలూకు బాగ్ లు ఆవిడ చూడనే చూసింది.
“బాగున్నాయి కదా?” అంది.
“ఏం బాగులే .. అసలు ఈ ఎల్లో చీర… ఒక్క నిమిషం నిలబడు ఫోటో తీసుకుంటాను.”
ఆవిడ మాస్క్ తీసి చేత్తో పట్టుకుని, తోపుడు బండి ఆనుకుని వాలుగా నిలబడే లోపు…
Thermal expansion కి అవకాశం లేకుండా వేసిన కారణంగా పగిలిపోయిన టైల్స్ ని మరో నియరెస్ట్ కలర్ టైల్స్ తో రీప్లేస్ చేసిన ఫ్లోరింగ్ ఫోటో లు రెండు యాంగిల్స్ లో తీసుకున్నాను.
**
కారు డోర్ ఈ వీకెండ్ లో రిపేరు చేయించుకోవాలి.
పోస్ట్ కేక అంతే శ్రీనివాసరావు గారు. ఒక్క లైన్ అని కాదు వరసబెట్టి ప్రతీ లైనూ అదుర్స్ .
LikeLike
భలే ! మీ రాతలకు నేను అభిమానినండి
LikeLike
thanks andi.
LikeLike