మూడు రోజుల నుండి పంది కొక్కు సమస్య చర్చకి వస్తూనే ఉంది.
మొదటి రోజు పప్పీలా గా ముద్దుగా ఉండే ప్రస్తావన, రెండో రోజుకి వేట కుక్క అయి మూడో రోజుకి చిరుత గా మారుతుంది.
గ్రౌండ్ ఫ్లోర్ లో కుండీలలో మట్టి తోడటం, మెట్లు మీద నానా చెత్త వదలటం, సీసా లో నుండి వచ్చిన భాష తెలియని చైనీస్ పొగ భూతం లాగా తలుపు తీయగానే చెప్పుల స్టాండ్ నుండి గబాలున దూకటం …
ఇంటి నిండా ఇంజనీర్లే.. పంది కొక్కు సమస్య సెటిల్ చెయ్యలేని చదువులూ చదువులే..
అని అప్పుడో మాట.. ఇప్పుడో విసురూ .. శబ్దం చేసే గిన్నెలు.. విసురుగా మూసే తలుపులు.. హన్నా.. మీకు చెప్పెతంతటి వాడినా?
రేయ్ సాయి యిటురారా.. యు ట్యూబ్ కొట్టు making a trap to trap a rat ఎట్సెట్రా ..
ఒక ఇరవై లీటర్ల పాత పెయింట్ డబ్బా అటక మీద నుండి దించి, దాని మూతి కోసేసాం.
మరో పల్చటి చక్క కి మద్య నుండి తాడు కట్టి రెండో చివర ఉల్లిపాయ వేలాడదీసాం.
బరువు, వేగమూ గమనమూ, స్ప్రింగు పని తనమూ, మూత వ్యాసము, డబ్బా ఎత్తు, తిరుగు ప్రయాణం లో మూత కి అడ్డుగా పడే ప్రతిపాదిత మూత .. హన్నా..
డబ్బా లో బరువు కి ఇటుక రాళ్ళు పెట్టి బియ్యప్పిండి చక్కలు నాలుగు అందులో వేశాం.
మార్స్ మీదికి వదిలే రాకెట్ ని ఈ సారికి మా పూల కుండీల మద్య సెట్ చేసి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నాం.
పంది కొక్కు అందులో పడుతుందంటావా? అంది మా ఆవిడ.
అది వెజిటేరియన్ అయ్యి బియ్యపు చక్కలు వాసన, ఉల్లిపాయ అరోమా,, ఖాయం గా బెజ్జం లోకి దూరటం పైన మూత అడ్డు పడటం.. tappad అంతే..
tappad ఏమిటి? అది trapped కదా?
ఇప్పటి ట్రెండింగ్ వర్డ్ అది. అది వాడక తప్పదు.
“ఇంతకీ ఆ పంది కొక్కు? “ఇంకా అనుమాన పడింది.
ట్రాప్ లోకి రాలేదా? ఉదయాన్నే ప్లాన్ –B
అదేంటి?
“గుమ గుమ లాడే నేతి గారెలు, అల్లం పచ్చడి. మనదే కాదు పక్కింటి పంది కొక్కులు కూడా తోకలు ఊపుకుంటూ రావాల్సిందే”
ఈ సారి thappad అనలేదే?
అదే ఆలో చిస్తున్నాను. ఒక వేళ మన ‘ఫ్రెండ్’ వెజ్ కాదనుకో.. అప్పుడో పని చేద్దాం..
ప్లాన్ C నా?
“భలే కాచ్ చేస్తావు నువ్వు. కుడోస్.
బాగా రెండు కేజిలు చందవా చేపలు తెచ్చి, సగం వేపుడు కూర మరో సగం తో పులుసు చేసి..నా సామి రంగా ఈ సారి తిరుగు లేదు”.
ఈ లోగా మా చిన్నమ్మాయి వచ్చింది.
ఏంటి? ఎలక్కేనా. ఈ మెనూ ?
కరెక్ట్ గా గుండమ్మ తో డీల్ ఫైనల్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఇస్తుంది.
రేయ్ సాయి అటక మీద మర చెంబూ కమండలం ఉంటాయి. వెతికి కిందకి దించు..
అవెందుకు? అంది ఇంటావిడ.
శుబ్రం గా తోమి పెట్టు. పట్టు పంచ కట్టుకుని కమండలం లో నీళ్ళు తల్లీ కూతుళ్ళు ఇద్దరి మీద చల్లాననుకో…
అదేదో .. ఆ పంది కొక్కు మీద చల్లోచ్చు గా ..
చేతి తో టీ కప్పు లాక్కుని లోపలి వెళ్ళింది.
#పాపో 2020
ఎప్పటిలాగే మీ చమక్కులు, చురుక్కులు అదుర్స్ శ్రీనివాసరావు గారు
LikeLike