రెండు వారాల తర్వాత ఇంట్లో లంచ్ చేశాను.దీక్షిత తో ఆడుకుంటుంటే తెలిసిన ఒక ఈఈ గారు ఫోన్ చేశాడు. “మీ ఏరియా లో అంజన రెసిడెన్సీ అని అపార్ట్మెంట్ ఉంది అయిడియా ఉందా? అని.”లేదన్నాను. అడ్రెస్ చెప్పాడు. “అక్కడి కి వస్తావా వీలుంటే ఫ్లాట్, construction క్వాలిటీ చూద్దాం.”షార్ట్స్ నుండి పొడుగు లాగు లోకి మారి బండి మీద అక్కడికి వెళ్ళాను.అప్పటికే ఆయన సతీ సమేతంగా వచ్చి, 3rd ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాడు. పక్కనే ఒక నలిగిన చొక్కా వెస్కుని పంచే కట్టుకున్న ఒక పెద్దమనిషి ఉన్నాడు.మాటల్ని బట్టి అతని వృత్తి అదేనని తెలుస్తుంది. ఫ్లాట్ అంతా తిరిగి చూశాక “oK అన్నట్లు తాలూపాను.”(కట్టుబడి కి ఒక డెబ్బై మార్కులు వేయొచ్చు. ఔట్ స్కర్ట్స్ లో ఉంది. పూర్తయి బిల్డర్ వద్దనే ఉన్న ఫ్లాట్. 3bhk రేటు కూడా అనుకూలంగానే ఉంది.)సదరు ఈఈ కి అప్పటికే ఒక 2bhk ఉంది. అందులోనే నివాసం ఉంటున్నాడు. తానొక ప్రత్యకమయిన బ్రీడ్ అని బలంగా నమ్మటం వల్ల మానసికంగా అతన్ని గుర్తించేవాళ్లు తక్కువ. చిన్న లిఫ్ట్ లో కిందకి వస్తుంటే, ఆమె అతన్ని లిఫ్ట్ లో మాతో వస్తావా అన్నట్లు చూసింది. అతనూ నేనూ మెట్లు దిగుతూ కిందకి వచ్చాం. కిందకి వచ్చాక సెల్లార్ లో అతన్ని నిలబెట్టి వివరాలు మాట్లాడుతున్నారు. ఇంక్కెడ అయినా రీజనబుల్ రేటుకి ఫ్లాట్స్ ఉన్నాయా అని. “ఏం లేదు అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఉన్న ఇల్లు చాలదు. త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొని పిల్లాడి పెళ్లి చేద్దాం’ అని ఈఈ వివరణ గా అన్నాడు మిడిల్ మెన్ తో ..ఏం చేస్తున్నాడు? అని అతను అడిగాడు.ఈయన బుజాలు ఎగరేసి ‘ యు ఎస్ లో ఉన్నాడు.” అన్నాడు. రోడ్డు పక్కన B కాలేజీ లో చదివి జాకీలతో లేపితే ఫ్లైట్ ఎక్కిన కుమారుడి గురించి ఆయన మొదలెట్టగానే, నా టైమ్ బాగుండి ఒక కాల్ వచ్చింది.పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చే సరికి కొడుకు గురించి బాగా చెప్పినట్లు మిడిల్ మెన్ చెవులు ఎర్రబడి ఉన్నాయి. “మనాళ్ళ లో ఎక్కడయినా మంచి పిల్లలు ఉంటే చెప్పు చూద్దాం” అన్నాడు. ఫ్లాట్ బదులుగా అమ్మాయి అని మాత్రమే మార్చాడు.“చెబుతాను.” అన్నాడాయన చెవులు రుద్దుకుంటూ..“మీకు పిల్లలు ఎంతమంది?” ఈఈ గారి శ్రీమతి అతన్ని అడిగింది. “ఇద్దరు అమ్మాయిలు. ఇంకా పెండ్లి చేయలేదు.” అన్నాడు.“ఏమన్నా చదివించావా?”ఆయన జేబులో చుట్ట బయటకి తీసి అంచు కోరుకుతూ ..”పెద్దమ్మాయి డాక్టర్.. విజయవాడలో పిజి కోసం తయారవుతుంది. చిన్నమ్మాయి సాఫ్ట్ వేర్. ఆస్ట్రేలియా లో ఉంది.” అన్నాడు. కారు వైపు నడుస్తున్న ఆమె “వదినని తీసుకుని మా ఇంటికి ఒకసారి రండి అన్నయ్యా” అంది చెవులదాకా నవ్వుతూ ఆయన అదేం పట్టించుకోకుండా తన పాత బైక్ వైపు నడుస్తూ “చూద్దాం” అన్నాడు పొడి పొడి గా…LikeCommentShare