ఆంజనేయులికి ఫోన్ చేసి షాప్ లో ఉన్నాడో లేడో కనుక్కుందాం అనుకున్నాను. తను మా ఆస్థాన హైర్ కట్టర్. :)పదిహేనేళ్ళ గా అదే షాప్ .. అంజయ్య రోడ్ లో ఒక ఆరామక్షేత్రం పక్కనే ఉన్న మునిసిపల్ కాలవ మీద ఉండే బార్బర్ షాప్ .. అబ్బా కొడుకులం అక్కడ కె వెళ్తాం.
ఈ మధ్య కరోనా కాలం లో మా చిన్నమ్మాయి ట్రిమ్మర్ తో క్రాఫులు చేసేది. (మా చిన్నదానికి తెలియని విద్య ఉందనుకొను).
ఫోన్ మీదికి చెయ్యే వెళ్ళేలోగా బుర్రలోనుండి లెక్కల పంతులు నిద్ర లేచాడు. “బుర్ర మీద చింపిరి జుట్టు కటింగ్ కి బుర్ర లేకుండా అయిదు కొలోమీటర్లు బండి తోలుకుని వెళ్తావా? పెట్రోలు లీటరు..తొంబై అయిదూ డివైడెడ్ బై యాబై నాలుగూ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ” అంటూ ఏవేవో చెప్పి నా ఆలోచనల మీద రెండు మూడు చుక్కలు పెట్రోల్ వేశాడు.
ఇలా కాదని చెప్పుల్లో కాళ్ళు దూర్చి నడవటం మొదలెట్టాను. కొంచెం నీట్ గా ఉండే బార్బర్ షాప్ లు వెతుక్కుంటూ.. ఒక కిలో మీటరు నడిచాక, ఒక మాదిరి షాప్ కనిపించింది. వాటం గా ఉన్న ఒకాయన కుస్తీ పోటీలకి సిద్దం అన్నట్లు కూర్చుని ఉన్నాడు. హైర్ డ్రస్ అండ్ మసాజ్ సెంటర్ అని అర్ధం వచ్చే ఒక బోర్డు.
లోపలికి వెళ్ళగానే కుర్చీ దులిపాడు. ఎదురుగా ఉన్న చిన్న బల్ల మీద నోటితో దుమ్ము ఊది సెల్లూ, కళ్ళజోడూ పెట్టాను.
ఇక యవ్వారం మొదలయ్యింది. ఒక శుభ్రం గా కనిపించే గుడ్డ ని మెడ చుట్టూ బిగించి కట్టాడు. ఇందాకటి లెక్కల పంతులు వచ్చి “ రెండు సైడ్లు చెవులకి తాకకూడదు. తలమీద అంగుళం మించి ఉండకూడదు” అని చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు.
ఎదురుగా కొన్ని సర్టిఫికెట్లు పటాలలో కూర్చుని కనిపించాయి. పక్కనే ఒక ధరల పట్టిక ఉంది. కానీ స్పష్టం గా లేదు. “మీరు trained మసాజరా?” అడిగాను. కత్తెర తో పాటు ఇక చెప్పటం మొదలెట్టాడు. “బొంబాయి, పూనా ఈ రెండు చొట్లే ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి. నాకసలు గచ్చి బౌలీ స్టేడియం లో ఉద్యోగం. వి ఆర్ ఎస్ ఇచ్చేశాను. ఇక్కడ చాలా ఖాతాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి మసాజ్ చేస్తాను. ఎవరికంటే వాళ్ళకి చెయ్యను. కటింగు కూడా అందరికీ చెయ్యను. ఈ ఆటో వాళ్ళు అలగా జనం ని అసలు లోపలికి రానివ్వను.” తనని తను ఎలివేట్ చేసుకుంటూ పావుగంట కటింగ్ ఇచ్చాడు. ఈ లోగా మరో కస్టమర్ వచ్చాడు.
సెల్ ఫోన్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుంటూ ఎంత అని అడిగాను. “ఆంజనేయులు ఇంటూ రెండు అని చెప్పాడు”
షాప్ బయటకి వచ్చి జేబులోనుండి వాలేట్ తీస్తుంటే.. “మీరు ఏం చేస్తుంటారు?” అన్నాడు.
మీరు అనే పదం కష్టం గా వాడటం గమనించాను.
“నేను అలగా జనం కి ఇంటి స్థలాలు ఇప్పించి, ఇల్లు కట్టించడం లో చేతనయిన సాయం చేస్తుంటాను. వాళ్ళకి చేసిన సర్వీస్ కి జీతం కూడా తీసుకుంటుంటాను. అందులోనిదే ఈ డబ్బు కూడా..”
Sir , please watch this video https://www.youtube.com/watch?v=iOt1p_fuIq8&ab_channel=KrishnarajRao. Dry walls అంటే ఏంటండీ . లోధా గ్రూప్ చీట్ చేసింది అని ఎవరో వీడియో పెట్టారు , లోధా వాళ్లేమో , అవి డ్రై వాల్స్ , చాల స్ట్రాంగ్ అని చెప్తున్నారు . అమెరికా లాంటి దేశాలలో కూడా ఇవే వాడతారు అని ఎవరో కామెంట్స్ లో పెట్టారు . నిజమేనా సర్ . అవి చుస్తే గుద్దితే పెద్ద హోల్ పడుతుంది .
మీ ఒపీనియన్ చెప్పండి సర్ .
LikeLike