oneకాయ గుర్తు

కొత్త ప్లేస్ లో పదోన్నతి మీద ఎం‌పి‌డి‌ఓ గా బాద్యత తీసుకున్న రోజే గ్రామ పంచాయతీ ఎలెక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. మండల అభివృద్ధి అదికారిణి కి ఇది అన్నప్రసాన రోజే ఆవకాయ లాటిది. తక్కువ పరిచయాలు, బలహీనమయిన సబ్ స్టాఫ్, వనరుల కొరత ఇలాటి సమస్యలు అనేకం…పది రోజుల పాటు సరైన నిద్ర/ తిండి జోలీలి వెళ్లలేని పరిస్తితి. మండల స్థాయి అదికార్లు అందరూ తలో చేయి వేసి, తమ పరిది దాటి బాద్యతలు తీసుకుని ఎలక్షన్స్ దిగ్విజయం గా పూర్తి చేసినందుకు నిన్న సాయంత్రం చిన్న గెట్ టుగెదర్ జరిగింది. ఎన్నికల ఫలితాలు, అబ్యర్ధి వారి ఓట్ల వివరాలు ఒక ప్రింటెడ్ booklet లోకి మారాయి. తలా ఒక కాపీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియచేసారవిడ.సరదా గా సమస్యలు వాటిని సాల్వ్ చేసిన పద్దతులు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. “దీని తరువాత మనం అటెండ్ చెయ్యాల్సిన అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా సార్” అని తాసీల్దార్ గారి అడిగారావిడ.ఆయన నన్ను చూస్తూ “ప్రస్తుతానికి ఏమీ లేవు. మీరేమంటారు సార్ ?” అని అడిగారు నన్ను చూస్తూ..“ఆలకూరపాడు లో వంకాయ గుర్తు వార్డ్ మెంబర్ కి ఒక్క ఓటే వచ్చింది. అబ్యర్ధి ఇంటావిడ కి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారా ?”

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started