మొన్నా మధ్య ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. నిండా రెండేళ్ళు వయసున్న తమ ఇంటికి గొడల్లో వచ్చిన పగుళ్లు అతన్ని భయపెట్టాయి. మర్నాడు ఉదయాన్నే వీడియొ కాల్ చెయ్యమని అతన్ని ఇల్లంతా పరిగెత్తించాను. తీరా చూస్తే ఇంటి నిర్మాణం లో స్ట్రక్చర్ చాలా బాగుంది. ఫినిషింగ్ హడావిడిగా చెయ్యటం,కారణం గా గమనించాను. గోడ కి గాడి కొట్టి నడిపిన కంసీల్డ్ కరెంట్ ఆర్ వాటర్ పైప్ నడిపినప్పుడు, వాటిని తిరిగి మాలు తో పూడ్చేస్తారు. ఆ తరువాత దాని మీద 12 మిల్లీమీటర్ల మందం ప్లాస్టరింగ్ (పూతపని) చేస్తారు. కంసీల్ చేసిన పైప్ గోడలో తగినంత లోతు లేనప్పుడు, పూతపని మీద సన్నటి పగులు వస్తుంది. అది పూతపని వరకే పరిమితం. మరో ఉదాహరణ లో కాంక్రీట్ కాలం (column) కి దాన్ని ఆనుకుని కట్టే పార్టీషన్ వాల్ కి మద్య నిలువుగా పగుళ్లు కనిపించవచ్చు. అధే విదంగా గోడ పైభాగం లో శ్లాబ్ బీమ్ కలిసే చోట సమాంతరం గా కూడా పూతపని లో పగుళ్లు కనిపించవచ్చు. దీనతటికి కారణం రెండు మెటీరియల్స్ ( కాంక్రీట్ మరియు బ్రిక్క్ వర్క్) వేర్వేరు లీనియర్ ఎక్ష్పాంషన్ లక్షణాలు కలిగి ఉండటమే.వీటన్నిటికి పరిష్కారం: రెండు ప్రాంతాల మీదికి కట్ చేసిన చికెన్ మెష్ ని కొట్టి దానేమీద ప్రీ ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంటుంది. తగినంత కూరింగ్ (తడపటం) చేశాక ఫైనల్ ప్లాస్టరింగ్ తో చదును చేసుకోవాల్సి ఉంటుంది. లేదా పార్టీషన్ వాల్స్ కట్టాక వారం రోజులు కనీసం కూరింగ్ చేయటం మంచిది. లేదా గోడల నిర్మాణం చేసి శ్లాబ్ వేయటం కూడా ఇలాటి పీల్పుడు పగుళ్లను అరికడుతుంది. శ్లాబ్ లోనూ, గొడల్లోనూ అంతర్గతం గా నడిపే ప్లాస్టిక్ పైప్ లు తగినంత లోతుగా (కనీసం 20ఎంఎం) ఉంచడం. వాటి ని pre ప్లాస్టర్ చేసి కూరింగ్ చేయటం ద్వారా ఈ మెష్ అవసరం లేకుండా నాణ్యమయిన పూతపని చెయ్యొచ్చు. ఉపసంహారం: పెద్ద మెష్ తెచ్చుకుని కట్ చేసుకునే అవసరం లేకుండా Brick reinforcement mesh) is made out of galvanized iron of nominal thickness 0.35 mm with Zinc coatingLength 20 meters సైజులో Arpitha Exports, No 56/1, 1st A Main, Magadi Main Road, Kottigepalya Bangalore 560091. www.arpithaexports.com వారు వివిధ సైజుల్లో తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి.




