ఎందుకిలా?

2016 ఒక మద్యాహ్నం ఒంగోలు రైల్వే స్టేషన్ లో పరిచయం. నేను సాయి చందు (మా అబ్బాయి) ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాం. ఇద్దరం సెల్ లో వచ్చే పాటని ఒకే ఇయర్ ఫోన్స్ తో వింటున్నప్పుడు సన్నగా బలహీనం గా ఉన్న ఒక చామనచాయ పిల్లాడు ఒకడు తండ్రి తో పాటు నిలబడి ఉన్నాడు. ఒక కర్ర సంచి లో సర్దుకున్న లగెజి పట్టుకుని ఉన్నాడు.పిల్లాడి తండ్రి కూడా మొహమాటస్థుడే.. నేనే పలకరించాను. “SASTRA కేనా?” అవునన్నట్లు చెప్పాడు.మేము కూడా అక్కడికే. కౌన్సిలింగ్ కి. తీరా చూస్తే ఒంగోల్లో మాయింటికి చాలా దగ్గర్లో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటారని తనకో కంప్యూటర్ పెరిఫరల్స్ షాప్ ఉందని తెలిసింది.సాయి కంటే తేజ మెరుగైన ర్యాంక్ లో ఉన్నాడు. “మంచి సీటు వస్తుంది.” అన్నాను.తండ్రి కళ్ళల్లో మెరుపు.**తేజ ECE లోనూ సాయి చందు కి తను మొదటి నుండి కోరుకుంటున్న మెకానికల్ లోనూ జాయిన్ అయ్యారు.తేజ చాలా మిత భాషి. అకాడమిక్స్ లో మంచిగా ఉండేవాడు. ఎవరితోనూ ప్రాపంచికాలు మాట్లాడేవాడు కాదట. శస్త్ర లో పూర్తి వెజ్ మెస్. అందుకనే సండే పిల్లలని త్రిచి గాని, తంజావూర్ గాని వెళ్ళి లంచ్ చేసి వస్తుండమని చెబుతుండేవాడిని. “తేజని కూడా తీసుకెళ్లు” అనేవాడిని. ‘మేం వెళ్ళేది లైబ్రరి కా? తను రాడు.’ అని సమాధానం వచ్చేది.sem సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు బోలెడు లగేజీ తో ఒకే ట్రైన్ లో వచ్చేవాళ్లు. అక్కడి నుండి మా కార్లోనే వేసుకొచ్చేవాళ్లం. తిరిగి వెళ్ళేటప్పుడు స్టేషన్ కి తన లగేజ్ కూడా తీసుకుని వెళ్ళేవాళ్లం.వాళ్ళ నాన్నగారికి నాకూ మంచి స్నేహం కుదిరింది. వారిది ఆర్ధికం గా అంత బలమైన కుటుంబం కాదని అనిపించింది. కొడుకు సెటిల్ అవటం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఎప్పుడయినా తన షాప్ కి వెళ్తుండే వాడిని. ఇద్దరం దగ్గర్లోని మౌర్య కి వెళ్ళి చాయ్ చప్పరిస్తూ ఉండేవాళ్లం. ఆయనకి తేజ కాకుండా మరో పాప ఉంది. మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లకి తేజ అమ్మగారు అటెండ్ అవుతుండే వారు.నాలుగేళ్ళు తిరిగాయి. తేజ కి సుమారు అయిదు కంపెనీ ప్లేస్మెంట్స్ వచ్చాయి.CTS, TCS, Wipro, ఇన్ఫోసిస్ ఇవన్నీ కాక తను ఇంటర్న్ చేసిన మరో కంపనీ లో వచ్చిన ఆఫర్ సైన్ చేయటం, అందులో జాయిన్ అవటం కోవిడ్ కారణం గా WFH చేస్తున్నాడని తెలిసింది.**సాయి కి ఎవరో ఫోన్ చేసి చెప్పిందాకా మాకు ఎవరికీ తెలియదు. నమ్మలేని విషాదం. చందు తో పాటూ మాకూ షాక్. ‘ఇంట్రవర్ట్ లతో ఇదే కష్టం’ అని మా అమ్మాయి, ‘వాళ్ళ నాన్నగారు కోలుకోలేరు’ అని మా అబ్బాయి కామెంట్ చేశారు కానీతేజ నాన్న గారిని కలిసే దైర్యం నాకు లేదు. నేనేమీ అడగలేదు. అడగలేను.కానీ ఎందుకిలా??(7/8 లో మూడు సబ్జెక్ట్స్ మిగిలాయని, అవి కూడా పూర్తి అయ్యాయని ఈ రోజు తెలిసింది.)

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

One thought on “ఎందుకిలా?

  1. అయ్యో , చాల బాధ . ఇసుక, సిమెంట్ ఎన్ని బస్తాలు అయినా మొయొచ్చు కానీ , తల్లితండ్రులు ఆశలు ని మోయడం మాత్రం కష్టం . అనుభవం తో చెప్తున్నాను , మధ్యతరగతి లో ఉన్న బాధే ఇది . నువ్వే అందరికి దారి చూపించాలి అన్న మాటలో ఎన్ని ట్రాక్టర్ల ఇసుక ఉంటాదో చెప్పలేము .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: