Toilet Sheets

బాత్రూమ్ లలో బిగించే టాయ్లెట్ షీట్లు రెండు/మూడు రకాలు ఉంటాయి.

  1. ఇండియన్ షీట్ : Indian Water closet IWC సాధారణం గా మనం చాలా కాలంగా వాడుతున్న పింగాణీ షీట్స్ ఇవి. రెండు కాళ్ళు మడతపెట్టి కింది కడుపు మీద వత్తిడి  కలిగేట్టు కూర్చునే ఈ భంగిమ సరైనది. మాలవిసర్జనకి కరెక్ట్ భంగిమ. ‘ఉపాసన’ కూడా ఈ మద్య కాలం లో ఇండియన్ Pan/Sheet లనే వాడమని కాంపైన్ చేస్తున్నారు.  ఈ షీట్ లని P – trap లేదా S-trap అనే చిన్న యూనిట్ తో సీవేజ్ పైప్ కి కలుపుతారు. సెప్టిక్ టాంక్ పై భాగం లోనే టాయ్లెట్ నిర్మాణం జరిగినప్పుడు S-trap ని, దూరంగా జరిగినప్పుడు P-trap ని బిగిస్తారు. ట్రాప్ యూనిట్ లు షీట్ నుండి మరుగు పైప్ కి వెళ్ళే మార్గాన్ని ఒక వంపు వద్ద నీళ్ళు నిలవ ఉంచడం ద్వారా దుర్గంధం రాకుండా కాపాడుతాయి. ఈ ఏర్పాటు ని వాటర్ సీల్ అని పిలుస్తారు. షీట్ లో నీళ్ళు పోయటానికి ఇప్పుడు చిన్న ప్లాస్టిక్ నిల్వ పెట్టెలు వాడుతున్నారు. అది గోడకి ఒక లివర్ తిప్పటం ద్వారా ఒకేసారి 8 నుండి 10 లీటర్ల నీరు షీట్ లోకి వచ్చి మలాన్ని బయటకి నెడతాయి. తిరిగి వాటర్ సీల్ దుర్గంధం రాకుండా ఆపేస్తుంది. అలా కాకుండా నీరుని ఒక బక్కెట్ట్టుతో విసురుగా వంపినప్పుడు ఒక్కోసారి వాటర్ సీల్ లోని నీరు కూడా జారీ పోయి గదిలో దుర్వాసన వస్తుంది. అప్పుడు ఒక మగ్గునీళ్లు నెమ్మదిగా షీట్ లో పోయాల్సి ఉంటుంది.
  1. EWC యూరోపియన్ వాటర్ క్లోసెట్ : కుర్చీ మాదిరి గా వచ్చే షీట్లు. దీనికి మూత ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ షీట్స్ బాత్రూమ్ లో స్థలాన్ని తక్కువ వినియోగించుకుంటాయి. పి ట్రాప్ లేదా ఎస్ ట్రాప్ తో కలిపి ఒకే యూనిట్ గా ఉంటాయి. వీటికి ఫ్లష్ టాంక్ లు గోడకి బిగించుకోవచ్చు లేదా ఫ్లష్ టాంక్ కూడా కలిపి ఒకే యూనిట్ గా ఉండేవి కూడా ఉంటాయి. ఆకారాన్ని బ్రాండ్ ని బట్టీ, 9000 నుండి 25 వేల వరకు ఉంటాయి. శారీరక సమస్యలు, మోకాళ్ళు వంగని వారికి తప్పదు గాని, EWC వాడటం అంత మంచిది కాదు. ఈ భంగిమలో మలవిసర్జన పూర్తిగా జరగదు.
  1. EWC లో మరికొంత మార్పులు జరిగాయి. అవే వాల్ మౌంటెడ్ closets. వీటిని గోడకి బిగించే అవకాశము ఉంది. తక్కువ పరిమాణం ఉన్న బాత్ రూమ్ లలో ఇవి బాగా నప్పుతాయి. పైగా వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఫ్లష్ టాంక్ లు గోడలోనే ఉండేవి. ఫ్లష్ టాంక్ లు బయటకి కనిపించేవి.

బాత్రూమ్ లలో బిగించే కుళాయిలు, ఫ్లష్ టాంక్ లలో ఉండే స్ప్రింగ్ ఆధారిత వాషర్ సీల్ లు మంచి నీటి తోనే బాగా పని చేస్తాయి. నీటిలో hardness ఎక్కువయినప్పుడు, రబ్బరు వాషర్ల చివర్లో scaling జరుగుతుంది. ఆ కారణం గా కొంత కాలం తర్వాత అవి సమర్ధవంతం గా పని చెయ్యలేకపోతాయి. టాప్ లలో స్పిండిల్ లు మార్చాల్సి రావటం, ఫ్లష్ టాంక్ లలో వాషర్ లు మార్చాల్సి లేదా తరచూ శుభ్రం చేయాల్సి రావటం జరుగుతుంది. అలా చెయ్యనప్పుడు కుళాయిలు ఎప్పుడూ సన్నగా కారి పోవటం, ఫ్లష్ టాంక్ ల నుండి నీళ్ళు ధార షీట్  లోనికి వస్తూనే ఉండటం జరుగుతుంది. ఇవి చిరాకు కలిగించే విషయాలు. కనుక ఫ్లష్ టాంక్ లు తేలిగ్గా శుభ్రం చేసుకునే వీలు ఉన్న టాయ్లెట్ షీట్ ఫ్లష్ టాంక్ లను ఎన్నిక చేసుకోవాలి.  అదే విధం గా కుళాయిలు కూడా సులువుగా రిపేరు చేసుకోవటం వీలయ్యేవి ఎన్నుకోవటం మంచిది.

5′ x 8′ bath room design

కేవలం లుక్ కి మాత్రమే ప్రయారిటీ ఇస్తే తర్వాత చికాకులు తప్పవు.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: