సత్తు గిన్నెల కారేజి

కొంత కాలం క్రితం ..ఒక ఆదివారం ఉదయాన్నే…
.
ముందస్తు ప్రణాళిక ప్రకారం నేను ,
పోకూరి వేంకటేశ్వర రావు (ఈతరం పిక్చర్స్ నిర్మాతలలో ఒకరు )
మద్దిపాడు మండలం, రాచవారి పాలెం గ్రామనికి ఉదయం ఎనిమిది కల్లా చేరాము.
.
అక్కడ సిద్దంగా ఉన్న ఒక మద్యవర్తి ని కలుపుకుని.
ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేశాం
బొలారోని ఊరి చివర అవకాశం ఉన్నంత వరకు వెళ్ళాక ఒక చెట్టు కింద వదిలేసి ..
కాలి నడకన బయలు దేరాము.
.
సబుకు తోటలు, చుట్టూ, తిప్పుతూ ,, .
చేతి లోని ఆడంగల్ కాపీ ని చూపిస్తూ..
పొలాల దరవరలు , విస్తీర్ణాలు సర్వే నెంబర్లు చెబుతూ..
అమ్మకానికి ఏవి సిద్దంగా ఉన్నాయో ..
యాజమానుల వివరాలు చెబుతూ ముందు నడుస్తున్నాడాయన.
.
కాన్వాజ్ షూ వేసుకుని ,, .
అలవాటు లేని గట్ల వెంట ,,
వయ్యారంగా మేమిద్దరం నడుస్తున్నాం.
.
ఏయే పొలాలు ఎవరెవరికి అమ్మించింది , .
ఇప్పుడు వాటి రేట్లు ,,
వారు లాభ పడిన మొత్తాలు .
తన సలహా పాటించిన వారి గురించి,
భవిషత్తు లో భూముల విలువలు ఎలా పెరగ బోతుంది ..
దారాళంగా ..చెబుతానే ఉన్నాడు….
.
కాలం నడుస్తూనే ఉంది మాకంటే వేగంగా.. .
10,,12,, మద్యాహ్నం ఒంటి గంట దాటింది.
పెటేల్మని ఎండ.. గ్రీష్మం ప్రతాపం చూపిస్తుంది.
చెమట తో చొక్కాలు తడిచి పోయాయి..
సోగ్గా తెచ్చుకున్న మినరల్ వాటర్ బాటిల్లు ఖాళీ అయ్యి చాలా సేపయ్యింది.
నాలుక పిడచ గట్టుకు పోతుంది.
..
బాగా అలవాటు ఉన్న అతను వేగంగాను,
వయసులో ఉన్న నేను మద్యస్తంగాను ,,
ఏ సి లకి అలవాటు పడ్డ పోకూరి భారం గాను నడుస్తున్నాం
ఉన్నపలాన వెను తిరిగి వెళితేనే బండి దగ్గరకి బిర్రుగా గంట నడక ఉంది..
.
“గుండ్లకమ్మ ఏటి దగ్గర ఉన్న సబుకు పొలాలు ఎకరా
20 నుండి 25 వెలకే రావచ్చు .. చూస్తారా” మద్యవర్తి ప్రశ్న.
.
అలసి ఉన్న తను ఇంక చాలు అంటాడు అనుకున్నాను.
కానీ అంకెలు ఆకర్ష నీయంగా ఉండటం తో సరే చూద్దాం అన్నాడు.

గాలి పటానికి కట్టిన తోకల్లాగా మేము మద్యవర్తి వెనుక నడక సాగించాము ..
.
ఏటి గట్టు దాపుల్లోకి వచ్చాం…
అప్పుడు .. సరిగ్గా అప్పుడు..
..
కొద్ది దూరం లో ఏటి నీటిలో చిన్న గుంట లో నడుము లోతు నీళ్ళలో
ఒక యువ జంట ఎదురెదురుగా నీళ్ళతో ఆడుకుంటున్నారు.
గుండెల మీదకి ఆ అమ్మాయి ఒక బట్టని చాకచక్యంగా కట్టుకుని ఉంది.
ఆ యువకుడు ఛాతీ మీదకి నీళ్ళు విసురుతుంది..
తిరిగి ఇతను ఆమెకి కిత కితలు పెడుతున్నాడు..
ఆ అమ్మాయి నవ్వుతోంది…
..
గట్టుమీద .. ఒక తుమ్మ చెట్టు నీడన కొద్ది స్టలమ్ శుభ్రం చేసి ఉంది. ..
ఆ దంపతుల బట్టలు ఒద్దికగా పెట్టి ఉన్నాయి.
ఒక రెండు లీటర్ల పేట్ బాటిల్ లో తాగే నీరు..
చెట్టుకి సత్తు గిన్నెల కారేజి కట్టి ఉంది.
ఆ కారేజి కి ఎర్ర చీమలు పట్టి ఉన్నాయి.
..
మా దౌర్భాగ్యపు ఉనికి వారి ఏకాంతాన్ని బగ్నం చేసింది. ..
చప్పున ఆ అమ్మాయి మెడ వరకు నీళ్ళలో మునిగేట్టు కూర్చుంది.
అతను అలికిడికి నీటి నుండి బయటకి వచ్చాడు రక్షణగా..
..అంతే ,, అంతే ,,
మేమేవ్వరిమి మాట్లాడలేదు.. ..
..
“మద్యానం పెండలాడే వస్తే బోజనమ్ చేసి చిన్న దాన్ని తీసుకుని..
సర్కస్ కి వెళ్ధాము ” అని చెప్పిన మా శ్రీమతి మాటలు గుర్తొచ్చాయి.
..
“ఆదివారం సినిమాకి వెళదామని రెండు వారాలుగా ..
ఇంట్లో అడుగుతున్నారు “ స్వగతంగా పోకూరి అన్నాడు.
..
మేము క్షణాల్లో మనుషులుగా మారి వేగంగా .. ..బొలారో వద్దకు నడిచాము.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: