MGBS లో ముందస్తు రిజర్వేషన్ లేకుండా బస్సు పట్టుకుని, ఒంగోలు వచ్చి సీతారాంపురం (మారేళ్ళవారిపాలెం) చేరే సరికి ఏడయ్యింది. ఇంట్లో మాములుగానే ఉంది, అని తెలియగానే మానాన్న మీద విరుచుకు పడ్డాను. ‘ఆ టెలిగ్రాం ఏమిటి?’ అని. అయన ఏమి మాట్లాడకుండా నవ్వి రెండో రోజు ఒంగోలులో అటెండ్ అవాల్సిన ఒక ఇంటర్వ్యూ లెటర్ చూయించాడు. వర్క్ చార్జేడ్ సిబ్బంది (టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్) నెలకి 700 రూపాయలు వేతనంతో తాత్కాలిక సిబ్బంది నియామకానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ద్వారా వచ్చిన కాల్ లెటర్. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, డిస్త్రిక్ మేనేజరు గారి కార్యాలయం, ఒంగోలు రామనగర్ లో హాజరవమని సారాంశం.
అప్పటికే నాన్న పలుచోట్ల విచారణ చేసి ఉన్నాడు. మంచి ఉద్యోగం అని తర్వాత రెగ్యులర్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు. నాన్నమాట మీద గౌరవంతో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. మొత్తం పదిహేను మందిని పిలిచినట్లున్నారు. 3 ఖాళీలు. కొందరు అప్పటికే ఉత్తరాలతో వచ్చి ఉన్నారు. ఉత్తరాల (సిఫార్సు లేఖల) వ్యవహారం నాకు అప్పటివరకు అంతగా తెలిదు. మాకు ఏవిదమయిన రాజకీయ పరిచయాలు లేనందున, ఆ ఉద్యోగం పట్ల పెద్దగా ఆసక్తి లేనందున నేను పట్టించు కోలేదు. వచ్చిన వాళ్ళలో మరో ఇద్దరు శ్రీనివాసరావులు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంతే ..
పేరు, ఊరు, దురదోస్తే ఎక్కడ? ఎప్పుడు? దేంతో గోక్కుంటావు? ఇలాటివి. సర్టిఫికెట్స్ నకళ్ళు అడిగారు, క్రితం రోజే కాలేజికి వెళ్లి వాటిని తెచ్చుకుని ఉన్నాను.
అడిగినవన్నీ ఇచ్చేసి అక్క దగ్గరకి వెళ్లాను. ఆదివారం సాయంత్రం హైదరాబాదుకి టికెట్ బుక్ చేయించుకున్నాను.
ఆరు నెలలు నిండిన మేనకోడలుతో ఆడుతుంటే కాలం తెలియటం లేదు. అక్క, బావ ఇద్దరు ఒక స్కూల్లో పని చేసుకోవటం, తక్కువ ఆదాయంతో అయినా స్థిరంగా జీవించడం మొదలెట్టారు. DSC నోటిఫికేషన్ వేశారని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కోసం బావ ప్రిపేర్ అవుతున్నాడని అక్క చెప్పింది. ఇక వారి గురించి కంగారు పడవలసిన అవసరం లేదని నాకు అర్ధం అయ్యింది.
డిప్లోమో మిత్రులు కొందరు కలిసారు. శ్రీవాత్సవ, అల్లుడు రమేశ్ (నన్ను మామా అంటుండేవాడు), వీరాంజి, మల్లికార్జున్ వాళ్ళంతా పంచాయితీ, మార్కెంటింగ్ యార్డు, ఇంకా అవకాశం ఉన్న చోట తాత్కాలిక సిబ్బందిగా చేరి ఉన్నారు.
“మామా ఇక్కడ నేర్చుకునేది ఏం ఉండదు. కంట్రాక్టర్ పనులు చేస్తాడు, మనం కొలతలు తీసి రాసి పెడతాం, ఎ.ఇ వాళ్ళ మధ్య సర్దుబాటుని బట్టి రికార్డ్ చేస్తుంటాడు. సైట్లో టి, టిఫిన్, భోజనాలు ఖర్చులు నడుస్తుంటాయి “ అంటూ మొదలెట్టి క్లుప్తంగా ప్రభుత్వ ఉద్యోగం విదులు చెప్పుకొచ్చాడు.
“అంటే ధఫెదారు పోస్ట్ .. బలే ఉందిరా ? నేను ఈఉద్యోగం వచ్చినా చేరను అల్లుడూ. ఎటు మనకి రాదనుకో. చాలా మంది సిఫారసు ఉత్తరాలు తెచ్చినట్టున్నారు.” నేను వాడితో చెప్పాను. కొంతసేపు సరదాగా గడిపి మారెళ్లవారిపాలెం ఇంటికి వెళ్లాను.
“సోమవారం, సెలెక్టెడ్ లిస్టు వస్తుందిట. నేను కనుక్కున్నాను.” నాన్న చెప్పాడు.
“సండే రాత్రి బస్సుకి నేను టికెట్ బుక్ చేయించు కున్నాను “ అని చెప్పాను.
“సోమవారం లిస్టు చూసుకున్నాక వెళ్లొచ్చు“
నాకు రిజర్వేషన్ కాన్సిల్ చేయించుకోక తప్పింది కాదు.

అనుకున్నట్టు గానే సోమవారం 12 గంటల ప్రాంతాల్లో (12-02-1987) ఇంటర్వ్యూ జరిగిన చోటకి వెళ్లాను. గోడకి ఒక లిస్టు అంటించి ఉంది. అందులో మూడుపేర్లు ఉన్నాయి.
1. పి.వి. నారాయణ
2. ఎస్.వి.వి.సత్యనారాయణ
3. సుంకర శ్రీనివాస రావు
భర్త లేకపోవడం, ఇద్దరు పిల్లలు , కనీసం పలకరించే మనిషి లేకపోవడం. ఎంత దుర్భరం . కొన్ని రోజులు నాకు ఇది వెంటాడుతుంది .
కొన్ని రోజులు తరువాత మర్చిపోతాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను . ఆ పిల్లలు భవిష్యతు ఏమైందో ..
LikeLiked by 1 person