39 అమీనమ్మ

రెగ్యులర్ డ్యూటి కి అలవాటు పడుతూ, వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ‘లాల్ జీ’ జీపు లో యూనిట్ 1515 వద్దకి వచ్చాడు. లిఫ్ట్ లో పైకి వచ్చి “క్యా బాయ్ హమే భూల్ గయే హో “ అంటూ పలకరించాడు. 
ఇద్దరం వాటర్ ట్యాంక్ గురించి, మధ్యమధ్య లో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నాం. నేను లేని ఆవారం రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పుకొచ్చాడు. హిమాయత్ నగర్ mecon ఆఫీసు డ్రాఫ్ట్స్ఉమన్ ఒకమ్మాయికి తను చాలాకాలం నుండి ‘బహుమతులు’ ఇస్తున్నట్లు, అవి ఎందుకు ఇస్తున్నాడో ఆమెకి స్పష్టంగా తెలిసినట్లు, కాని అమాయకంగా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 
‘It’s time to get married Lal jee “ నేను నవ్వుతూ చెప్పాను. 
“హోగా .. వో.భి హోగా” నిట్టూర్చాడు అతను. ముగ్గురు చెల్లెళ్ళ వివాహం కావాల్సి ఉందని గతంలో చెప్పి ఉన్నాడు. 
మద్యాన్నం భోజనం అయ్యాక క్వార్టర్స్ లో సిఎస్టా (మద్యాన్నపు కునుకు) లో ఉన్నప్పుడు, వర్క్ సూపర్వైజర్ వచ్చి ఈశ్వరమణి గారు రమ్మంటున్నాడు అని చెప్పాడు. “ఎక్కడున్నారు?”
“యూనిట్ 1818 వద్ద”
యూనిట్ 1818 అనేది RCI ప్రాజెక్ట్స్ లో అతి పెద్ద నిర్మాణం సుమారు 10 మీటర్ల ఎత్తు, 70మీటర్ల పొడవు, ౩౦ మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పక్క పక్కనే అతికించి ఉన్న v ఆకారం లో 8 అంగుళాల మందం కలిగిన స్లాబు వేసి ఉంటుంది. (VVV ఇలా folded roof ) చాలా ప్రిస్టేజియస్ నిర్మాణం. విజయదశమికి ముందే దాని స్లాబ్ వేశారు. మూడు వారాలు దాటినట్లు ఉంది. ఇంకా పూర్తిగా సెంటరింగ్ తీయలేదు. 
“సరే పద” నేను షు లేసులు కట్టుకుని, అటువైపు బయలు దేరాను. 
గేటు వద్ద ఒక సూపర్వైజర్ ఉన్నాడు. తలకి పెట్టుకునే సేఫ్టి టోపీ ఇచ్చి “సార్లు లోపల ఉన్నారు” అన్నాడు. 
నేను లోపలి వెళ్లాను. మూడు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తయిన స్లాబు కింద ఉన్న సెంటర్రింగ్ ఇనుప రేకులు ఊడతీయటానికి ఎత్తుగా తాత్కాలికంగా కదిలే మంచ ఏర్పాటు ఉంది. అక్కడ ఆ యూనిట్ ఇంచార్జ్ AE రామచంద్రన్, వర్క్స్ మేనేజర్ ఈశ్వరమణి ఉన్నారు. నన్ను చూడగానే మణిగారు పైకి రమ్మన్నట్టు సైగ చేసాడు. జిగ్ జాజ్ గా ఉన్న తాత్కాలిక మెట్లు ఎక్కి నేను పైకి వెళ్లాను. 
రామచంద్రన్ ముఖం కందగడ్డలా ఉంది. ఈశ్వర మణి ‘రావ్ అక్కడ చూడండి’ అన్నాడు.
కొద్దిగా తొలగించిన రేకు మీద స్లాబ్ కాకుండా కొంత హానికుంబ్ కంకర (defective concrete) స్లాబ్, స్టీలు కనబడుతున్నాయి పైన మరో ఇనప రేకు 1x 0.5 మీటరు సైజు ది ఇరుక్కు పోయి ఉంది.
నాకు విషయం వెంటనే బోధపడింది. స్లాబ్ వేసేటప్పుడు చువ్వల మీద సౌకర్యంగా నడవటం కోసం కొన్ని రేకులు వేసుకుంటారు. శ్లాబ్ వేసే కొంది వాటిని తీసివేస్తూ ఉంటారు. చాలాసార్లు రేకు సిమెంట్ పాలుతో కలిసి పోతుంది. గమనించక పోతే అది అలాగే ఉండి పోతుంది. కింద సువ్వలు మిగిలి పోతాయి. అదే జరిగింది. రాత్రింబగళ్ళు వరుసగా పనిచేసేటప్పుడు (సుమారు 2300 బస్తాల కాంక్రీట్) అలాటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సైట్ ఇంజనీరు జాగర్త గా ఉండాలి. 
దాన్ని ఎదో ఒకటి చెయ్యొచ్చు. సమస్య అల్లా MECON వాళ్లకి తెలియకూడదు. తెలిస్తే క్వాలిటి సర్టిఫికేట్ ఇవ్వరు. లక్షల రూపాయల బిల్లు విడుదల కాదు. అది సమస్య. 
ఆదివారం రోజు mecon వాళ్ళు రాని శలవురోజు దానిని పరిష్కరించాలని అనుకున్నాం. వారి కార్యాలయంలో నాకు మంచి రేపో ఉండటం వల్ల నన్ను అక్కడికి పిలిచి నట్లు నాకు అర్ధం అయ్యింది. ఎంత మెత్తగా టార్గెట్స్ కేటాయిస్తారో అనే దానికి ఇది మంచి ఉదాహరణ. 
సాయంత్రం ఒక్కడినే కేబుల్ చానెల్ వర్కు పెండెన్సీ చూసుకుంటూ ఒక బుక్లో నోట్ చేసుకుంటూ మూడున్నర కిలోమీటర్లు నడిచాను. సబ్ స్టేషన్ల వద్ద చాలావర్క్ పెండింగ్ ఉంది. ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ అదికార్లు ఫైనల్ చెయ్యాల్సిన వర్క్ ఉంది. కేబుల్ చానెల్లో ప్రతి ఎనిమిది అడుగులకి ఒకటి చొప్పున నిలువుగా కాంక్రీట్ లో నిలబెట్టిన ఇనుప చానెల్ కి లంభంగా మూడు loft లు వెల్డింగ్ వర్క్ మొదలు పెట్టటానికి అంతా సిద్దంగా ఉంది. రెగ్యులర్ హమాలీ లతో చానెల్ మొత్తం శుభ్రం చేయించాలి. మూడో సబ్ స్టేషన్ నుండి దగ్గర మార్గంలో కార్టర్స్ బయలుదేరాను.

అక్కడ అమీనమ్మ ఎదురయ్యింది. మా రెగ్యులర్ హమాలి ఆమె. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విడో అని విన్నాను. ఆమెకి ఆ సమయంలో అక్కడ ఏమి పనో నాకు అర్ధం కాలేదు. “సబ్ సెంటర్లో చెప్పులు మర్చిపోయాను” అంది నేనేమీ ప్రశ్నించకుండానే. కాని విషయం అదికాదు అని తెలుస్తుంది. ఉన్నంతలో శుభ్రంగా తయారయి ఉండటం, తను స్త్రీ అని ఇతరులు గమనించేటట్లు నడవటం నాకు వింతగా అనిపించింది.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: