పల్లెటూర్లలో వేడుకలకి షామియానాలు వేసేటపుడు నాలుగు మూలలా వెదురు బొంగుని నిలబెట్టి దానిని స్తిరంగా ఉంచడానికి తాళ్లు కడతారు. అలానే మేం ఎక్కివచ్చిన లిఫ్ట్ ని స్తిరంగా ఉంచడం కోసం రెండు తాళ్ళు ఏటవాలుగా కట్టి ఉన్నాయి.
నేలవైపు వెళ్తున్న సవారి శరీరం సరిగ్గా ఆతాడుకి తాకింది. సర్కస్ లో నెట్ మీద కళాకారులు గాలిలోకి లేచినట్లు అతను తిరిగి గాల్లోకి లేచి ఈసారి సరిగ్గా ఎటు చూసినా పదిఅడుగులు మించని నీటితొట్టిలో పడ్డాడు.
మేమెవరం జరుగుతున్నది గ్రహించే స్తితిలో లేము. ఒక స్టిల్ ఫోటో లాగా అందరం ఆగిపోయి ఉన్నాం. చలనం ఎవరిలో అయినా ఉందంటే అది ‘సవారి’ లోనే.
తొట్టిలో నీళ్ళు లీక్ ప్రూఫ్ మెటీరీయల్ కలిపి నల్లగా ఉన్నాయి. వాటి మీద వెన్నెల వెలుతురు. సవారి స్ప్రింగ్ లాగా లేచి బయటకి వచ్చాడు. కంకర కుప్ప వద్ద ఉన్న అతని భార్య వీపున కట్టుకున్నబిడ్డతో సహా పరిగెత్తింది. అతను ఆమెను పట్టించుకోకుండా లిఫ్ట్ వద్దకి వచ్చాడు. లిఫ్ట్ ఆపరేటర్ గజగజా వణుకుతున్నాడు. ఒక దెయ్యాన్ని లైవ్ లో చూస్తున్నట్లు బిగుసుకు పోయాడు. సవారి అతన్ని పక్కకి లాగి లిఫ్ట్ ని తానే కిందకి దించుకుని, QHPC కాంక్రీట్ తొట్టిలో నిలబడి ఆపరేటర్ కి చెప్పి తిరిగి పైకి వచ్ఛాడు.
నా వైపు చూస్తూ “సార్ లేటయ్యింది. కంకర పనికి వస్తుందా లేక కింద పొసెయ్యాలా ?” అని అడిగాడు. నాకు నోటివెంట మాట రాలేదు. అతను కిందకి జారటమే గుర్తొస్తుంది. ఏదో హాలివుడ్ సినిమా చూస్తున్నట్లు ఉంది.
తడిచి ఉన్న బన్నియన్, పొడవు నిక్కరు, నడుముకి వేలాడుతున్న బెల్టు. అతన్నిభయం భయంగా చూస్తూ ఉండిపోయాను. ముందుగా కోలుకున్న లాల్ జీ అతని చెంప చెళ్ళు మనిపించాడు. “అరె గధే బెల్ట్ క్యోమ్ నహి లగాయా?”
కింద ఉన్న అతని బార్య పక్కన్న నిల్చున్న చిన్నపిల్లాడు తండ్రిని చూసి నవ్వుతున్నాడు. అతని బార్య చేతులు ముడిచి కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్దిస్తుంది.
వాతావరణం నార్మల్ అయి పని తిరిగి మొదలవటానికి, పావుగంట పైగా పట్టింది.
మా వర్క్స్ మేనేజర్ ఈశ్వరమణి తెల్లవారగట్లే వచ్చాడు. అప్పటికి కాంక్రీట్ వర్క్ పూర్తయింది.
జరిగినది అంతా విని సవారిని పరామర్శించి ఎందుకయినా మంచిదని దగ్గరలోని హాస్పిటల్ కి పంపించాడు. జరిగిన ఘటన విని మాకొలిగ్స్ మాత్రమే కాకుండా మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా పొగయ్యారు.
RCI ప్రాజెక్టు లో పని చేస్తున్న అందరు సైట్ ఇంజనీర్లకు అప్పుడప్పుడు స్కిల్స్ డెవెలెప్మెంట్ ప్రోగ్రాం లు నిర్వహించేవారు. సహజంగానే వాటిని లైట్ తీసుకోటం, దాన్ని ఒక శలవు రోజుగా భావించడం జరిగేది. ఆరోజు సాయంత్రం ఒక సిమెంట్ కంపనీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అటెండ్ అయిన అదరికి వారి కంపెనీ లోగోలు ప్రింట్ అయి ఉన్న టీషర్ట్స్ ఇచ్చారు. ఫీల్డ్ లో ఎదురయ్యే సమస్యలకి ఎలాటి నివారణలు ఉంటాయో చెప్పారు. ఆరోగ్యం, ఇన్సూరెన్స్ లాటి వాటి గురించి విస్తృతంగా మాట్లాడారు.
ఇంటివద్ద నుండి నాన్న రాసి పంపిన కవరు వచ్చింది. నాన్నఎప్పూడు కార్డులే వ్రాసేవాడు. చిత్రంగా అనిపించి అక్కడే ఓపెన్ చేశాను. ఆయన ఉత్తరం తో పాటు “ఉదయం వార పత్రిక” నుండి అల్లాణీ శ్రీదర్ గారి సంతకంతో వచ్చిన ఒక లెటర్ ఉంది. ఆతృతగా చదివాను.
ఉదయం వీక్లీకి కధ పంపి యాడాది దాటింది. నేను కధలు రాయటం ఆపేసి కూడా నాలుగు నెలలయింది. ఏమి పంపానో గుర్తులేదు. నేను చాలా రోజులక్రితం వ్రాసి పంపిన ‘ఈ జన్మ కిది చాలు ‘ అనే కధ, ‘పెద్ద కధ’ అనే శీర్షికన ప్రచురించనున్నట్లు, దానికి గాను కధా రచయిత ఫోటోతో బాటు పరిచయం పంపితే కధతో పాటు ప్రచురిస్తామని ఉంది అందులో..

నేను లెటర్ మీద డేటు చూశాను. రెండు వారాల క్రితంది. కానీ ఎందుకో నేరుగా హైదరాబాదు క్రాస్ రోడ్ లో ఉన్న ఆఫీసుకి వెళ్ళి కలిస్తే బాగుండు అనిపించింది.
ఈశ్వరమణి గారి వద్ద పర్మిషన్ తీసుకుని ఒక టువీలర్ మీద పహడి శరీఫ్ వద్దకి వెళ్ళాను. సిటిలోకి వెళ్ళి పాస్ పోర్ట్ ఫోటోలు తీయించుకున్నాను. ఇంకా బొచ్చు పీకని బ్రాయిలర్ కోడి లాగా వచ్చింది నాముఖం. ఉన్నది అది. మరేమి చెయ్యటం. RTC క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ఉదయం ఆఫీసుకు వెళ్ళాను. గేటు వద్ద అనుమతులు అయ్యాక లోపలికి వారపత్రిక కార్యాలయానికి వెళ్ళాను. శ్రీ అల్లాణి శ్రీధర్ గారు ఎడిటర్ (కాంపస్.. కాంపస్ అని సీరియల్ వ్రాస్తున్నారు అప్పుడు), నాగేంద్రదేవ్ గారు అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. నేను ఎడిటర్ గారి రూముకి వెళ్ళి విష్ చేసి నిలబడ్డాను.
“నేను, నన్ను అంటూ నసుగుతూ చేతిలోని ఉత్తరాన్ని చూపించాను.” నిండా 21 ఏళ్ళు నిండని 48 కేజీల బక్కచిక్కిన నన్ను చూసి ఆయన “ఓహో సుంకర శ్రీనివాసరావు గారు పంపారా? ఏమవుతారు మీరు ఆయనకి?” అన్నాడు. “లేదండీ నేనే సుంకర శ్రీనివాసరావు @సుశ్రీ ని “ చెప్పాను.
మీ పోస్టులలో పెట్టె ఫొటోస్ మీద క్లిక్ చేస్తే, జిమెయిల్ కి లాగిన్ వెళ్తుంది . జనరల్ గా , ఫొటోస్ మీద క్లిక్ చేస్తే అవి ఇంకొంచెం పెద్దవి గా కనిపిస్తాయి . కానీ మీ బ్లాగ్ జిమెయిల్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి సర్ .
LikeLike