4. సుశ్రీ నువ్వే కదా?

నేను బెరుగ్గా హాల్లోకి వెళ్ళేటప్పటికి మా బాస్ సోఫాలో కూర్చుని, హిందూ పేపర్ చూస్తున్నారు.
గదిలో ఒక మూల బుష్ కలర్ టి.వి ఉంది. ప్లే అవుతున్న కలర్ టీ.విని అంత దగ్గరగా చూడటం అదే.
టీవి స్టాండ్ కింద ఆకాయ్ వి‌సి‌పి లోంచి వచ్చే టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాం చూస్తూ, ఒక పాతికేళ్ళ యువతి కూర్చుని ఉంది. 
నేను అత్యంత నిశబ్దం గా లోపలికి వచ్చి స్టార్ హోటల్ డోర్ మెన్ లాగా అంతే వినయంగా నిలబడ్డాను.
ఆయన నన్ను గమనించి, రీడింగ్ గ్లాస్ ల లోనుండి చూసి, అప్పటి దాకా పేపర్ క్రింద ఉన్న పోస్టల్ కవర్ల వైపు చూపించాడు. రెండు మూడు కార్డులు, రెండు ఇన్లాండ్ లెటర్స్, బ్రౌన్ కవర్స్ ఉన్నాయి,
సుంకర శ్రీనివాసరావు, c/o శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ, 31-xxx, హింది ప్రచార సభ రోడ్, మద్రాస్ -17.
నన్ను కలవర పెట్టింది అందులో ఉన్న బేరర్ కవర్, ఏదో పత్రిక నుండి తిరిగి వచ్చిన కధ,
పోస్టల్ స్టాంపులు అంటించకపోవటం వల్ల బేరర్ కవర్ లో పంపారు. పోస్ట్ మన్ రెట్టింపు డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఆ కారణం గానే కవర్లు కింద ఆఫీస్ కి కాకుండా పైకి చేరి ఉంటాయని అర్ధం అయింది.
జడ్జి ముందు నుంచున్న ముద్దాయిలా ఉంది నాపరిస్తితి. “ఏం చేస్తున్నావు రా? ఇన్ని ఉత్తరాలు వచ్చాయి?.”
“ఇది మొదలు కాదు. ప్రతి రోజు ఈపిల్లాడికే ఎక్కువ పోస్ట్ వస్తుందట. నారాయణ రావు చెప్పాడు.” ఆ పాతికేళ్ళ అమ్మాయి టి వి ఆపి లోపలికి వెళ్తూ అంది. నా చొక్కా తడిచి వీపు కి అంటుకోవటం మొదలయ్యింది.
“ క .. క ..కధలు రాస్తాను “ నాకే వినబడి చావలేదు.
“ ఇలాటివా? “ కవర్ లోంచి తిరిగి వచ్చిన కాగితాలు చూపిస్తూ అడిగాడు.
“ఇవేమయినా కూడు పెడతాయా? దీనికోసమేనా మీనాన్న నిన్ను నాదగ్గర వదిలింది. కెరీర్ కి సంభందించిన పుస్తకాలు చదువుకో. లేదా అన్నా యూనివర్శిటీ లో పీజీ డిప్లొమోలు ఉంటాయి. ఎప్పుడో ఒక వారం రోజులు కాలేజీ కి వెళ్తే చాలు. వాటిలో చేరు. ఉపయోగం. విధ్య ఒక్కటే నిన్ను నిలబెట్టేది. మూడేళ్లు డిప్లొమో చదివావు. క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ని అంటున్నావు. DATA పుస్తకం లేకుండా ఒక quantity కూడా స్వంతంగా లెక్కకట్టలేవు. రేపు సైట్ లోకి వెళ్తే ఈతెలివి దేనికయినా ఉపయోగపడుతుందా? అనేది ఒక్కసారి ఆలోచించుకో. జీవితాన్ని నిలబెట్టుకునే పనులు నేర్చుకో బాగుపడతావు. వచ్చేనెలలో ‘ఆవడి’ లో కొత్త వర్క్ మెదలవుతుంది. నిన్ను ఫీల్డ్ కి పంపుతాను.” ఆయన ఆ పోస్ట్ కవర్లు నావైపు నెట్టారు. తిరిగి పేపర్ లో మునిగి పోయారు.
నేను బ్రతుకు జీవుడా అనుకుంటూ వాటిని తీసుకుని మెట్లు దిగాను. బేరర్ కవర్ గురించి ప్రస్తావించందుకు బాగా అనిపించింది. మొత్తానికి ఆయన మాటలు నెమరు వేసుకుంటూ ఈ సారి అన్నా యునివర్సిటి కి వెళ్లాలని అనుకున్నాను.

రెండు రోజులు గడిచాయి.
రోజు లానే సాయంత్రం తయారయి పానగల్ పార్కు సర్వే కి బయలు దేరబోతుంటే ‘ఆయమ్మ’ ఆరవ తెలుగులో
“రెడ్డి గారి చిన్నమ్మాయి సాయంత్రం బోజనానికి రమ్మంది “ అంది. ఆమె రెండు మూడు సార్లు చెప్పినప్పటికి నాకు అర్ధం కాలేదు. ఫ్లాట్ ఫార్మ్ గాడిని, గోప్పింటి బిడ్డ బోజనానికి పిలవటం నాకు భయం వేసింది.
ఇంతలో పై నున్న పోర్టికో నుండి “ ఆరే శీను ఎక్కడికీ వెళ్లకు. అపర్ణ నీతో మాట్లాడాలట, ఇవాళ ఇక్కడే తిందువు.” అంది రెడ్డి గారి బార్య.

స్నానం చేసి శుబ్రంగా ఉన్న బట్టలు వేసుకున్నాను. ఆ గంట నా జీవితం లో చాలా సుదీర్గమయినది
వత్తుగా ఉన్న జుట్టుకి తడి చేసి దువ్వాను. పై నుండి పిలుపు రాగానే తాబేలు లాగా వెళ్ళాను. నేను మా బాస్ ఇల్లు పరిశీలించి చూడటం అదే. నాకు అప్పటి వరకు మూడు నిలువు రూముల ఇల్లు మాత్రమే తెలుసు..

లోపలే మెలితిరిగిన మెట్లు ఉండటం అనేది inside outside అనే ఇంగ్లిష్ పత్రికలో చూశాను. ప్రత్యక్షం గా గమనించడం ఇదే. మెట్ల మీది నుండి పైకి వెళ్తూ ‘వాడిని బెదర కొట్టకుండా అన్నంపెట్టు’ అని చెబుతూ రెడ్డి గారి బార్య అపర్ణ తో చెప్పింది.
డైనింగ్ టేబుల్ వద్ద కూచోబెట్టి ఎదురుగా కూర్చుని వేడివేడి అన్నం, నేనెప్పుడు తినని కూరలు వడ్డించి కడుపునిండా అన్నం పెట్టింది. ఇంకా వడ్డించబోతుంటే “ ఇక తినలేను అక్కా“ అన్నాను. కళ్ళు తడి అయ్యాయి.

చేయి కడుక్కున్నాక ఒక గాజుకప్పులో ఐస్ క్రీమ్ ఇచ్చింది. సోఫాలో కూర్చోమంది. కానీ నేను పక్కనే ఉన్న చిన్న స్టూల్ లాగి దాని మీద కూర్చున్నాను. చల్లటి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే, నాకు ఒక పత్రిక తెరిచి చూపిస్తూ అడిగింది..


“రేయ్ నిజం చెప్పు ‘సుశ్రీ’ అంటే నువ్వే కదా?“ అంది. అందులో నేను రాసిన కధ ఉంది.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

One thought on “4. సుశ్రీ నువ్వే కదా?

  1. నేను బాపట్లలో చదువుకునే రోజుల్లో (1985) మా ఇంటికి ఒక ఇన్వెలప్ కవర్ వచ్చింది.చించి చుస్తే ఎడమ వైపు పై భాగాన su sri అని స్టాంప్ వేసిన లెటర్ అది! ఆ ప్రేరణ తో వెంటనే ఒక లెటర్ హెడ్ ప్రింట్ చేయించు కున్నాను.గమ్మత్తేమిటంటే సుశ్రీ అంటే అమ్మాయి అని మా ఇంట్లో గోల!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: