నా లైఫ్ లో అత్యంత ఫెయిల్యూర్ పార్ట్ ఇంటర్ రెండు సంవత్సరాలు. 1980-82 దాని పోస్టుమార్టం పక్కన పెడితే.. వచ్చిన 58 శాతం ఉత్తీర్ణతకి, బి ఎస్సీ (CSR శర్మా కాలేజి, ఒంగోలు) లో సీటు రాలేదు. అప్పట్లో ఈ ప్రైవేట్ కాలేజీలు లేవు. ఇంటర్ నుండి ఇంజనీరింగ్ కి వెళ్తారన్న విషయం నాకు తెలియదు. నా చదువు ప్రశ్నార్థకం అయింది. నాగులుప్పలపాడు మండలం పెద గంజాం లో మాకు కొంత పొలం ఉండేది. మేము మా నాన్న గారి ఉద్యోగ రీత్యా మద్దిపాడు దగ్గరలో ఉండేవాళ్లం. అక్కడి నుండి బసవన్నపాలెం మీదుగా మద్దిరాలపాడు నాగులుప్పలపాడు రావచ్చు. సౌడు భూమిని #వెంపలాకు వేసి మడు ల్లో తొక్కి ఊరబెట్టి భూమిని పంటకు అనుకూలం గా చేసేవాళ్ళు. మా అమ్మ నన్ను పొలం తీసుకెళ్లేది. ఒంగోలు నుండి ప్యాసింజర్ రైలు ఎక్కి ఉప్పుగుండూరు దిగి, మిలటరీ మాన్యం లో ఉన్న పొలానికి నడిచి వెళ్ళేవాళ్ళం. పొలం లో నీరు కట్టటం, వెంపలాకు తొక్కటం, వాటిల్లో ఉండే పాముల నుండి తప్పించు కోటం, మధ్యాహ్నం ఒంటి గిన్నె టిపిని లో చింతకాయ పచ్చడి తో కలిపిన అన్నం ఎర్ర చీమలు ఊదుకుని తినటం.. సాయంత్రానికి కాళ్ళు నాని మెత్తబడేవి, ఏవో ఒకటి గుచ్చుకుని గాయాలయేవి. రిటర్న్ లో మళ్లీ పాసింజరు ఎక్కినప్పుడు, నిలబడి ఉన్నవాళ్ళ కాళ్ళమధ్య కూలబడి నిద్రపోయే వాడిని… నాన్న చూడలేక పోయేవాడు. టెన్త్ లో మెరిట్ స్టూడెంట్ ని కనుక ఆ మార్కులతో, గుంటూరు, నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లకి అప్లై చేసి ఉన్నాను. BA లో చేరటానికి మరో అప్లికేషన్ పెట్టించాడు. నెల్లూరు లోనూ, గుంటూరు లోనూ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ అలాట్ అయింది. ఇంట్లో రెండ్రోజులు మదనం జరిగింది. హాస్టల్ లో ఉంచి చదివించడానికి మా కుటుంబం ఆర్ధికంగా సిద్దం గా లేదు. అక్క పెళ్లి చేసి ఉన్నారు. వాటి తాలూకు అప్పులు ఇంకా ఉన్నాయి. నన్ను తెలివైన పిల్లాడు (టెన్త్ లో మద్దిపాడు స్కూల్ టాపర్ ని 457/600) అని బాగా అభిమానించే ఒక మేడం గారు (సూర్యకుమారి, చేకూరపాడు) అప్పటికే నా ఇంటర్ దరిద్రం తెలిసి అత్యంత హేయమయిన తిట్లు తిట్టి బాధ పడి ఉన్నారు. నేను అతి పెద్ద తప్పు చేశాను అని తెలుసుకొని ఉన్నాను. ఒక్క సారిగా నా ముందు డోర్స్ మూసుకు పోయాయి. మా అమ్మ ఏమీ అనేది కాదు కానీ అలవాటు లేని పొలం పనికి లేదా శారీరక శ్రమ విపరీతం గా ఉండే పనికి తీసుకెళ్ళేది. మా అమ్మ దండన స్థాయి భయంకరం గా ఉండేది. అది వ్రాస్తే మీరెవ్వరూ నమ్మరు . మా నాన్న గారు నా గురించి చాలా మదన పడ్డాడు. ఆయన దైన్యం నాకు అర్ధం అవుతూ ఉండేది. ఈ లోగా నాకు BA సీట్ వచ్చింది. Economics, politics, తో .. పూర్తిగా కొత్త సబ్జెక్ట్. శర్మా కాలేజీ లో చేరాను. BA అయినా శ్రద్ధగా చదవాలని ఇంటర్ లాటి తప్పు మళ్ళీ చేయకూడదని చదువు విషయం లో ‘law of diminishing marginal utility’ అన్వయించుకో రాదని గట్టి తీర్మానం చేసుకున్నాను. అప్పుడు .. సరిగ్గా అదే నెలలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రబుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు అవటం దానిని చీరాలలో/ అద్దంకి లో ఏర్పాటు చేయవచ్చని రూమర్స్ చివరికి ఒక మహానుభావుడి ఆర్ధిక సాయం తో, చొరవతో ఒంగోలు లో కళాశాల ప్రారంభించడం సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ బ్రాంచీలతో వారి పేరుతోమొదలయిన ప్రభుత్వ కళాశాల లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో సీట్ రావటం లేటుగా dec 1982 లో సాంకేతిక విద్య లోకి నా చదువు టర్న్ తీసుకోవటం .. తెచ్చుకున్న సిగ్గుతో శ్రద్ధ గా చదువుకోవటం, (stood second topper with 1625/2000) తదుపరి అదే విద్య తో ఉపాది పొందటం. నేర్చుకున్న విద్య కి మెరుగులు దిద్దుకోవటం.. ఈ స్థితి కి రావటం.. ఆయన #విద్యా_బిక్ష గా గర్వం గా చెప్పుకుంటున్నాను. **** నేడు కీర్తి శేషులు #శ్రీ_దామచర్ల_ఆంజనేయులు గారి జయంతి. వారికి సదా ఋణపడి ఉన్నాను. |
